: సల్మాన్ ఖాన్ కు పెద్ద ఊరట... ఆయన నిర్దోషేనని జోధ్ పూర్ కోర్టు తీర్పు!
అక్రమంగా ఆయుధాలను కలిగున్న కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా జోధ్ పూర్ కోర్టు ప్రకటించింది. అతను ఆయుధాలు ధరించి వున్నట్టు బలమైన సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు కూడా సరైన సాక్ష్యాలను అందించలేదని చెప్పారు. తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ కూడా కోర్టులోనే కూర్చుని ఉన్నారు. ఆయనతో పాటు సోదరి అల్వీరా కూడా కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో సల్మాన్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.