: 'డియర్ బీజేపీ డరో మత్'... ట్వీటేసిన రాహుల్... వైరల్!
కాంగ్రెస్ ఎన్నికల గుర్తు 'హస్తం'పై బీజేపీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వినూత్నంగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. "డియర్ బీజేపీ డరో మత్" (ప్రియమైన బీజేపీ భయపడవద్దు) అని ఆయన పెట్టిన ట్వీట్ ను వందలాది మంది షేర్ చేసుకున్నారు. గత వారంలో 'జన వేదన సమ్మేళన్' జరిగిన సమయంలో రాహుల్ మాట్లాడుతూ, తమ ఎన్నికల గుర్తు దేవుళ్లలో, ఆధ్యాత్మిక గురువుల్లో కనిపిస్తుందని వ్యాఖ్యానించగా, హస్తం గుర్తును తొలగించాలని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.