: ఎమ్మెల్సీగా వెళ్తానన్న వార్తలు ఊహాగానాలే: స్పష్టం చేసిన లోకేశ్
తాను ఎమ్మెల్సీగా వెళ్లనున్నట్టు వచ్చిన వార్తలపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. దివంగత ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఈ ఉదయం నివాళులు అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్సీగా వెళ్తానన్నది ఊహాగానమేనని స్పష్టం చేశారు. మంత్రి వర్గంలో తన చేరికపైనా ఎలాంటి చర్చా జరగలేదని, పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహించడమే తన కర్తవ్యమని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటానని అన్నారు. ఈ వర్థంతి సందర్భంగా 20 వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు రక్తదానాలు చేయనున్నారని తెలిపారు.