: కేజ్రీవాల్ కు షాక్... హ్యాండిచ్చిన అత్యంత సన్నిహితుడు


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన కుమార్ విశ్వాస్ త్వరలోనే బీజేపీ తీర్థం తీసుకోబోతున్నారు. ఇప్పటికే బీజేపీకి, ఆయనకు మధ్య చర్చలు పూర్తయ్యాయని... ఏ సమయంలోనైనా కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. చర్చల్లో భాగంగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సహిబాబాద్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని విశ్వాస్ కోరినట్టు సమాచారం. దీనికి బీజేపీ కూడా సిద్ధంగానే ఉందట. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో విశ్వాస్ భేటీ కానున్నారు. అనంతరం, బీజేపీలోకి విశ్వాస్ చేరికపై అధికారిక ప్రకటన వెలువడనుంది. గతంలో కుమార్‌ విశ్వాస్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ తరుపున రాహుల్‌గాంధీ, స్మృతి ఇరానీపై పోటీ చేశారు.  


  • Loading...

More Telugu News