: కేపీహెచ్ బీ కాలనీలో ఆన్ లైన్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు


హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతంగా ఎదిగిన కేపీహెచ్ బీ కాలనీలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. తాజాగా ఆన్ లైన్ లో వ్యభిచార కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఓ ముఠా గుట్టును కేపీహెచ్ బీ పోలీసులు రట్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బెంగుళూరుకు చెందిన అలీమ్, నూర్ అహ్మద్, ఉమర్ ఫారుఖ్, శశికుమార్ లు కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. స్థానిక 6వ ఫేజ్ లో ఓ అపార్ట్ మెంటులో ఫ్లాట్ అద్దెకు తీసుకుని, ముంబైకి చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా విటులతో వీరు బేరసారాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, ఆ ఫ్లాట్ పై దాడి చేసి, ఓ యువతితో పాటు నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News