: తెలంగాణకు మూడు లక్షల ఏళ్ల చరిత్ర.. బయటపడుతున్న చారిత్రక ఆధారాలు.. నిర్ధారిస్తున్న చరిత్రకారులు
తెలంగాణకు మూడు లక్షల ఏళ్ల చరిత్ర ఉందని పరిశోధనకారులు చెబుతున్నారు. సిద్ధిపేట జిల్లా పుల్లూరులో ఇటీవల బయటపడిన అస్థిపంజరం, వస్తువులు, వరుసగా బయటపడుతున్న రాక్‌సైట్స్ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని అంటున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న డిస్కవర్ తెలంగాణ సదస్సులో పాల్గొన్న పలువురు చరిత్రకారులు తెలంగాణ చరిత్రకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 40 రాక్‌సైట్స్ వెలుగులోకి వచ్చినట్టు చరిత్ర పరిశోధకుడు సత్యనారాయణ తెలిపారు. అలాగే శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాల ప్రాంతంలో బయటపడుతున్న విదేశీ నాణేల ఆధారంగా చరిత్రను మరింత లోతుగా తెలుసుకునే వీలుకలుగుతుందని లండన్ యూనివర్సిటీకి చెందిన రెబెకా పేర్కొన్నారు. స్వస్తిక్ గుర్తును తొలిసారి తెలంగాణలో వినియోగించిన విషయం తాజా పరిశోధనలో వెలుగుచూసింది. తెలంగాణ చరిత్రను వెలికితీసే ఉద్దేశంతో గ్రీకుకు చెందిన జార్జి మిషెల్, హెలన్ ఫిలాన్‌లు డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్‌తో కలిసి పరిశోధనలు చేస్తున్నారు.