: ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దావోస్ వేదికపై చంద్రబాబు
ఆధార్ అనుసంధానంతో దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను సంపూర్ణంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం మంగళవారం ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచరీ అనే అంశంపై ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడంలో ఏపీ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరిస్తున్న వినూత్న ప్రణాళికల గురించి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా ప్రపంచంలోని ఏ ఆధునిక నగరమూ ప్రగతి సాధించలేదని తెలిపారు. దేశంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) విధానం ఉన్న ఏకైక రాష్ట్రం కూడా ఏపీనేనని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఐవోటీ పాలన కోసం ఉపయోగిస్తున్న కోర్ డ్యాష్ బోర్డు గురించి సభికులకు పరిచయం చేశారు.