: ‘సెట్’ లో చిరంజీవి గురించి కాజల్ చెప్పిన సంగతులు!


‘మెగా’ హీరోలు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బన్నీల సరసన నటించిన ఏకైక హీరోయిన్ కాజల్. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో ఆయనతో నటించి ఆకట్టుకుంది. చిరంజీవితో తన నటన అనుభవాల గురించి ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో కాజల్ ప్రస్తావిస్తూ, సెట్ లో చిరంజీవి చాలా ఫ్రెండ్లీగా ఉండేవారని, ఒక సీనియర్ యాక్టర్ గా ప్రవర్తించే వారు కాదని కితాబిచ్చింది. అంతేకాదు, షూటింగ్ సమయంలో చిరంజీవి చెప్పిన సూచనలు విభిన్నంగా ఉండేవని, ‘నేను అయితే ఇలా చేసేవాడిని’ అంటూ ఆయా సీన్లకు సంబంధించి చిరంజీవి తనకు చెప్పేవారని పేర్కొంది. ఆ  విషయాలు ఎంతో ఆసక్తిగా ఉండటంతో వాటిని తాను పాటించే దానినని కాజల్ చెప్పింది.

  • Loading...

More Telugu News