: ప్రవచనాలు మానుకునే ఆలోచనలో చాగంటి కోటేశ్వరరావు!
తనపై కేసులు పెట్టడంతో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు మనస్తాపం చెందారు. దీంతో ప్రవచనాలు చెప్పడం మానెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రవచనాలు చెబుతోంటే పదే పదే కేసులు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రెండు రోజుల క్రితం కృష్ణుడి గొప్పతనం వివరించే క్రమంలో చేసిన వ్యాఖ్యలు యాదవుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ యాదవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నొచ్చుకున్న ఆయన అసలు ప్రవచనాలే మానేస్తే ఈ జంఝాటం ఉండదని భావిస్తున్నారట.