: జైలులో సెల్ఫీ దిగిన షాబుద్దీన్ పై ఎఫ్ఐఆర్ నమోదు


రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ, ఓ హత్య కేసులో నిందితుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రస్తుతం బీహార్ లోని సివాన్ జిల్లా కారాగారంలో ఖైదీగా ఉన్నాడు. అయితే, జైల్లోనే సూటు, బూటు ధరించి ఒక సెల్ఫీ దిగిన షాబుద్దీన్ ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో ఇటీవల పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో షాబుద్దీన్ పై, ఆయనకు సహకరించిన మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వినయ్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఇద్దరు అధికారులను నియమించారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంది. కాగా, సివాన్ ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నికైన షాబుద్దీన్ పై 36 కేసులు ఉన్నాయి. 

  • Loading...

More Telugu News