: పోలీసుల అదుపులో సోలార్ పవర్ కాంట్రాక్టుల మోసగాడు


సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడ్డ ఆగస్టీన్ బోస్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారిణి స్వాతి లక్రా మాట్లాడుతూ, నిందితుడు రెండు వెబ్ సైట్లు ఏర్పాటు చేసుకుని సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడని, ఆయనపై ఇప్పటివరకు ఏడు కేసులు ఉన్నాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పలువురి నుంచి రూ.150 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం ఉన్న రూ.2 కోట్లు సీజ్ చేశామని, కార్లు, భవనాలను కూడా సీజ్ చేశామని, బ్యాంకు స్టేట్ మెంట్స్, కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News