: హైదరాబాదు నుంచి అశ్లీల దృశ్యాలు అప్ లోడ్ చేస్తున్న అమెరికా వాసి అరెస్టు!


అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న అమెరికా జాతీయుడు జేమ్స్ కిర్క్ జోన్స్ ను అరెస్టు చేసిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మాదాపూర్ లో నివాసం ఉంటున్న జోన్స్, ఇంటర్నెట్ లో చిన్నారుల అశ్లీల దృశ్యాలను డౌన్ లోడ్, అప్ లోడ్ చేస్తున్న విషయాన్ని ‘ఇంటర్ పోల్’ ద్వారా  సీఐడీ పోలీసులు తెలుసుకున్నారు. దీంతో, వెంటనే రంగంలోకి దిగారు. ఐపీ అడ్రసు ఆధారంగా నిందితుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. జేమ్స్ పై కేసు నమోదు చేశారు. మాదాపూర్ లోని విదేశీ న్యాయ సంస్థలో జేమ్స్ పనిచేస్తున్నాడని, రెండేళ్లుగా సోషల్ మీడియా వెబ్ సైట్లలో ఈ తరహా పోస్టింగ్ లు చేస్తున్నాడని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News