: ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేసి నిర్ఘాంతపోయిన యువకుడు!


ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేసిన యువకుడు నిర్ఘాంతపోయిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఖర్గో జిల్లాలో చోటుచేసుకుంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే 2000 రూపాయల నోట్లే ఎక్కువగా వస్తుండడంతో, 1500 రూపాయలు డ్రా చేశాడో యువకుడు. వెంటనే ఏటీఎం మెషీన్ నుంచి మూడు 500 రూపాయల నోట్లు వచ్చాయి. కొత్త నోట్లను మనసారా చూసుకుందామని రెండో వైపు తిప్పిన యువకుడు షాక్ తిన్నాడు. రెండోవైపు 500 రూపాయల నోటుకు ఎలాంటి ముద్ర లేకపోవడం విశేషం. తొలిసారి 500 రూపాయల నోట్లు వస్తున్నాయన్న ఆనందంతో ఆ యువకుడు డబ్బులు డ్రా చెయ్యడాన్ని స్నేహితుడితో వీడియో తీయించాడు. దీంతో ఈ తతంగం మొత్తం వీడియోగా చిత్రీకరించబడింది. దానిని బ్యాంకు అధికారులకు చూపించగా, అతనికి నోట్లు మార్చి ఇచ్చిన అధికారులు, ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News