: సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి కన్నుమూత


సీనియర్  సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఉయ్యూరు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఈరోజు ఉదయం ఆయన మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి మృతిపై తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. కాగా, దర్శకుడు సాగర్ కు శ్రీనివాస్ రెడ్డి సోదరుడు. అలాగే హాస్యనటుడు బ్రహ్మానందానికి వియ్యంకుడు.

సినిమాటోగ్రాఫర్ గా, దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలకు ఆయన వ్యవహరించారు. మౌళి, సుధాకర్ బాబు, సాగర్ లతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘జగదేకవీరుడు’, ‘అమ్మ దొంగ’ చిత్రాలను, నిర్మాత చంటి అడ్డాలతో కలిసి ‘ఆరోప్రాణం, బాచి, ‘పవిత్ర ప్రేమ’ తదితర చిత్రాలను నిర్మించారు. రష్మీ ప్రధాన పాత్రలో నటించిన 'చారుశీల' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. 

  • Loading...

More Telugu News