: జయలలితపై శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు
దివంగత జయలలిత బతికినంత కాలం కుక్కిన పేనులా ఉన్న శశికళ భర్త నటరాజన్ అప్పుడే విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితను తమ కుటుంబమే కాపాడిందని... తన భార్య శశికళ జయను 30 ఏళ్ల పాటు కాపాడిందని ఆయన చెప్పారు. ఎంజీఆర్ అంత్యక్రియలకు జయలలితను తీసుకెళ్లామని... ఎంజీఆర్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న వాహనం నుంచి జయను తోసివేశారని... ఆ సమయంలో ఆమెకు అండగా తామే ఉన్నామని... ఆమె జీవితాంతం తామే మద్దతుగా నిలడ్డామని తెలిపారు. జయలలిత ముఖ్యమంత్రి కాకుండా బ్రాహ్మణులు అడ్డుకున్నప్పటికీ, ఆమెను తామే ముఖ్యమంత్రిని చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో, తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగడం అనైతికమేమీ కాదని అన్నారు. నటరాజన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.