: ఆమె 16 ఏళ్ల బాలికే...ఆమెను వదిలేయండి!: జైరాకు మద్దతిచ్చిన అమీర్ ఖాన్


'దంగల్' సినిమాలో 'గీతా ఫోగట్' పాత్రలో నటించిన 16 ఏళ్ల కశ్మీరీ బాలిక జైరా వసీంకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, స్క్రీన్ ఫాదర్ అమీర్ ఖాన్ మద్దతు పలికారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అమీర్, జైరా రాసిన క్షమాపణ లేఖను పూర్తిగా చదివానని, ఆమె పరిస్థితి తనకు పూర్తిగా అర్థమైందని తెలిపారు. తాను చేస్తున్న ఈ ట్వీట్ ద్వారా ఆమె వెంట తానున్నానని చెప్పడమే దీని ఉద్దేశ్యమని అన్నారు. నీ లాంటి ధైర్యవంతులైన, ప్రతిభావంతులైన, కష్టపడే స్వభావం గల పిల్లలు ఎక్కడున్నా, ఎలాంటి పిల్లలకైనా నీవు ఆదర్శమని చెప్పారు.

అంతెందుకు, తనకు కూడా జైరా ఆదర్శమని అమీర్ తెలిపారు. ఈ మేరకు ఆమెపై మతం పేరిట వేధింపులకు దిగుతున్నవారికి ఒక నోట్ ను పంపారు. అందులో జైరా ఇంకా 16 ఏళ్ల బాలిక అని, జీవితంలో ఏదో సాధించాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న బాలిక అని, ఆమెను ఇంతటితో వదిలేయాలని సూచించారు. ఆమెను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. కాగా, జైరాకు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలవడం విశేషం. కాగా, జైరా వసీం, అమీర్ ఖాన్ తదుపరి చిత్రంలో కూడా నటించనుంది.  

  • Loading...

More Telugu News