: దీక్ష విరమించిన టి కాంగ్రెస్ ఎంపీలు
ఢిల్లీలో టి కాంగ్రెస్ ఎంపీలు దీక్ష విరమించారు. తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేస్తూ రెండు రోజుల కిందట పార్లమెంటు ఆవరణలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం తదితరులు 48 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీ ఎంపీలు.. మద్దతు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంపీలు డిమాండు చేశారు. ఎంపీలు దీక్ష చేసిన రెండురోజుల్లో ఇతర పార్టీల వారు మద్దతు తెలపగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.