: హైదరాబాదుపై జోకులు వేసుకునే పరిస్థితి వచ్చింది... దీన్ని విషాద నగరంగా మార్చొద్దు: కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని విషాద నగరంగా మార్చొద్దని టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సూచించారు. నగరంలోని రోడ్లపై జోకులు వేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. నగర రోడ్లపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిలయన్స్, టాటా కంపెనీలు తమ అవసరాల కోసం రోడ్లను తవ్వేస్తున్నాయని తెలిపారు. పోలీసు భద్రత మధ్య రోడ్లను తవ్వుతుండటం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. రోడ్ల తవ్వకాలను నిరసిస్తూ ధర్నాలు చేస్తే, అరెస్ట్ లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. వీధి దీపాలు కాలిపోతే కొత్తవి తెచ్చి, వేసే శక్తి కూడా జీహెచ్ఎంసీకి లేదా? అంటూ ప్రశ్నించారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని... సగటు హైదరాబాదీ గుండె చప్పుడును వినిపిస్తున్నానని అన్నారు.