: గూగుల్ తొలి స్మార్ట్ ఫోన్ పై స్నాప్ డీల్ బంపర్ ఆఫర్


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్మాప్ డీల్, గూగుల్ తొలి స్మార్ట్ ఫోన్ పై రూ. 10 వేల తక్షణ క్యాష్ బ్యాక్ ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ తో ఆన్ లైన్ రిటైల్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న స్మాప్ డీల్, ఎస్ బ్యాంక్ ఈ-క్యాష్ ద్వారా క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. దీనికి అదనంగా బజాజ్ అలయన్స్ నుంచి రూ. 5,999 విలువైన మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ అందిస్తామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ విశాల్ చద్దా వెల్లడించారు. తమ బ్రాండ్ కిందకు గూగుల్ పిక్సెల్ రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. తాజా ఆఫర్ తో మరిన్ని స్మార్ట్ ఫోన్లు విక్రయించగలమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, గూగుల్ పిక్సెల్ 128 జీబీ ధర రూ. 66 వేలుగా, 32 జీబీ ధర రూ. 57 వేలుగా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో తీసుకుని, పాత స్మార్ట్ ఫోన్ ఇస్తే రూ. 23 వేల వరకూ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News