: స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది.. చిన్నారుల పట్ల జాగ్రత్త!:హెచ్చరిస్తున్న హైదరాబాద్ వైద్యులు


ఈ శీతాకాలంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ఒక్కసారిగా విజృంభించడంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గడచిన వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ ఆసుపత్రులకు వస్తున్న స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సుల్తాన్ బజార్, చిలకలగూడ, విక్రంపురి, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వ్యాధి కారక వైరస్ అధికంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

స్వైన్ ఫ్లూ సోకి గాంధీ ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందగా, పది రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. ఆపై పలు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చికిత్సలు పొందుతున్నారు. జలుబు, దగ్గు లక్షణాలతో వచ్చిన వారిలో పలువురికి ఇప్పటికే వ్యాధి సోకినట్టు నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కాగా, ఒక్క సోమవారం నాడే గాంధీ ఆసుపత్రిలో ఆరుగురికి స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు తేల్చారు. గత మూడేళ్లుగా మరణమృదంగం మోగిస్తున్న స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్యను ఈ సంవత్సరం గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ, ఉస్మానియా సహా పలు ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ రోగులకు ప్రత్యేక విభాగాలను సిద్ధం చేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News