: క్రిష్ కోసం జక్కన్న, బాలయ్య కోసం రానా జర్నలిస్టుల అవతారం ... ఈ వారంలో ప్రసారం!


ఇప్పటికే హిట్ టాక్ ను తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకెళుతున్న చారిత్రక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని మరింతగా ప్రమోట్ చేసేందుకు జక్కన్న రాజమౌళి, భల్లాలదేవ రానాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు టీవీ చానళ్లలో బాలకృష్ణ, క్రిష్ తదితరుల ఇంటర్వ్యూలు నిత్యమూ ప్రసారం అవుతుండగా, ఓ ప్రముఖ టీవీ చానల్ వీరితో వినూత్న కార్యక్రమాన్ని రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణను రానా, క్రిష్ ను రాజమౌళి ఇంటర్వ్యూ చేసినట్టు సమాచారం. చిత్రంపై సరికొత్త విశేషాలతో కూడిన ఈ స్పెషల్  ఇంటర్యూలు ఈ వారాంతంలో ప్రసారం కానున్నాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమాలు ఇంకా చిత్రం చూడని వారిని థియేటరుకు తీసుకెళ్తాయని అటు బాలయ్య, ఇటు క్రిష్ భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News