: వివాదాల మధ్య ప్రారంభమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధ్యక్ష పదవి బరిలో తెలంగాణ రాష్ట్ర సలహాదారు వివేక్, విద్యుత్ జయసింహలు ఉన్నారు. మొత్తం 218 మంది సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

ఎన్నో వివాదాల మధ్య ఈ ఎన్నికలు జరుగుతుండటంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. అయితే, బీసీసీఐ విధించిన నిషేధం ఇంకా కొనసాగుతోందన్న కారణంగా అజార్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను రిజర్వ్ లో ఉంచబోతున్నారు. హైకోర్టు తుది ఉత్తర్వుల తర్వాతే ఫలితాలను ప్రకటిస్తారు.

  • Loading...

More Telugu News