: కోహ్లీ సేనకు హోటల్ గదులు కరవు... పుణెలోనే ఆగిపోయిన టీమిండియా


విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు సభ్యులకు కటక్ లో హోటల్ గదులు అందుబాటులో లేవు. దీంతో పుణెలో ఇంగ్లండ్ తో విజయానంతరం, కటక్ చేరుకోవాల్సిన జట్టు ఇంకా బయలుదేరలేదు. వాస్తవానికి సోమవారం నాడే పుణె నుంచి భారత జట్టు కటక్ చేరుకోవాల్సి వుంది. వీరి కోసం హోటల్ గదులను బుధవారం నుంచి బీసీసీఐ బుక్ చేయగా, హోటల్ యాజమాన్యం మంగళవారం నాటికి వేరే అతిథులకు వాటిని కేటాయించింది. దీంతో కటక్ వెళితే, రూములుండవని భావించి జట్టును పుణెలోనే ఉంచింది. ఇక రేపు రెండో మ్యాచ్ జరగనుండగా, నేడు భారత జట్టు కటక్ చేరుకోనుంది. ఆపై వెంటనే మైదానానికి వెళ్లి, పిచ్ పరిస్థితిని పరిశీలించడంతో పాటు టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News