: త్రిషకు పోలీస్ భద్రత కల్పించండి... చెన్నై సీపీని వేడుకున్న ఉమా కృష్ణన్


జల్లికట్టు, ట్విట్టర్ వివాదాల నేపథ్యంలో తన కుమార్తెకు ప్రాణహాని ఉందని దక్షిణాది హీరోయిన త్రిష తల్లి ఉమాకృష్ణన్ చెన్నై నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. త్రిషకు పోలీసు భద్రత కల్పించాలని కోరారు. త్రిషను బెదిరిస్తూ, ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. తామెన్నడూ జల్లికట్టుకు వ్యతిరేకం కాదని చెబుతూ, తమిళ సంప్రదాయాలకు, సాహసంతో కూడిన జల్లికట్టుకు తమ కుటుంబం మద్దతిస్తుందని వివరించారు. త్రిష ఎన్నడూ పెటా సంస్థకు ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. తన కుమార్తెకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, తమిళనాట తమపై వస్తున్న వ్యతిరేకతపై పెటా ఇండియా వెటర్నరీ డైరెక్టర్ మణిలాల్ తీవ్రంగా స్పందించారు. జంతువులపై ప్రేమ, దయ చూపితే, జాతికి వ్యతిరేకులా? అని ప్రశ్నించారు. డీఎంకే నేత స్టాలిన్ చేస్తున్న డిమాండ్లను మణిలాల్ తోసిపుచ్చారు.

  • Loading...

More Telugu News