: ట్రంప్ ను తక్కువ అంచనా వేయొద్దు... మార్చి చూపిస్తాడు: ఒబామా

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తక్కువగా అంచనా వేయొద్దని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఒబామా తన చివరి ఇంటర్వ్యూను 'సీబీఎన్' చానల్ కు ఇచ్చారు. ట్రంప్ ను మార్పు తెచ్చే వ్యక్తిగా అభివర్ణించిన ఒబామా, సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్నా, విజయవంతంగా ప్రచారం నిర్వహించి ఎన్నికల్లో విజయం సాధించాడని కితాబిచ్చారు.
తనకన్నా మెరుగ్గా పాలించగలడని మాత్రం భావించడం లేదని, అధికార మార్పిడి సైతం అసాధారణంగా ఉందని అన్నారు. దేశాన్ని మార్చే శక్తి అమెరికన్లకు ఉందని, అయితే, అది కొందరు పెద్దల నిర్దేశకత్వంలో జరుగుతుందని, ట్రంప్ నాయకత్వంలో అమెరికాలో మార్పు ఖాయంగా కనిపిస్తోందని తెలిపారు. అయితే, అది దేశ భవిష్యత్తుకు దారితీస్తుందా? లేక మరేదైనా చేటు తెస్తుందా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఒబామా అన్నారు.