: చిందేసిన ఎంపీ మాగంటి బాబు.. చిరంజీవి పాట‌కు డ్యాన్స‌ర్ల‌తో క‌లిసి స్టెప్పులు!


కృష్ణా జిల్లా కైక‌లూరులో జ‌రిగిన సంక్రాంతి ముగింపు సంబ‌రాల్లో ఏలూరు ఎంపీ మాగంటి బాబు  సంద‌డి చేశారు. డాన్స‌ర్ల‌తో క‌లిసి స్టెప్పులేసి అద‌ర‌గొట్టారు. గతంలో చిరంజీవి నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని 'వానా వానా వెల్లు‌వాయే..' సాంగ్‌కు డ్యాన్స‌ర్ల‌తో క‌లిసి చిందేసి వేడుక‌ల‌కు హాజ‌రైన వారిని ఉర్రూత‌లూగించారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌జ‌లు, పార్టీ నేత‌లు ఈల‌ల‌తో ఆయ‌న‌ను మ‌రింత ఉత్సాహ‌ప‌రిచారు. దీంతో రెచ్చిపోయిన ఎంపీ మ‌హిళా డ్యాన్స‌ర్ల చేతులు ప‌ట్టుకుని చిరంజీవిని అనుక‌రించారు.  పాట మొత్తానికి ఆయ‌న వేసిన డ్యాన్స్‌తో యువ‌కులు హుషారెత్తిపోయారు. ఆ ప‌రిస‌రాలు ఈల‌లు, కేరింత‌ల‌తో మార్మోగిపోయాయి.

  • Loading...

More Telugu News