: అందుకే నోట్ 7 ఫోన్లు పేలిపోతున్నాయి.. వెల్లడించిన శామ్‌సంగ్
నోట్ 7 ఫోన్లతో అపఖ్యాతి మూటగట్టుకున్న శామ్‌సంగ్ ఎట్టకేలకు ఆ ఫోన్లలోని బ్యాటరీలు ఎందుకు పేలిపోతున్నాయో కనుగొంది. నోట్ 7 వైఫల్యాలకు గల కారణాలను పూర్తిగా బయటకు చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్న శామ్‌సంగ్ ఆ పోన్లు పేలిపోవడానికి మాత్రం అందులోని బ్యాటరీయే కారణమని పేర్కొంది. సంస్థ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో ఈ విషయం బయటపడినట్టు తెలిపింది. దర్యాప్తు నివేదికను ఈనెల 23న విడుదల చేసే అవకాశం ఉంది. గెలాక్సీ ఎస్ 8ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న శామ్‌సంగ్ నోట్ 7 వైఫల్యాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కాగా నోట్ 7 వైఫల్యం అతిపెద్ద టెక్ వైఫల్యంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.