: నేను షాజహాన్ అయితే అఖిలేశ్ ఔరంగజేబు.. అభివర్ణించిన ములాయం!
రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కుమారుడు అఖిలేశ్ యాదవ్‌పై పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన ములాయం సింగ్ యాదవ్ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అఖిలేశ్ తనను అర్థం చేసుకోవడం లేదని, మాట్లాడేందుకు మూడుసార్లు పిలిచినా నిమిషం మాట్లాడగానే లేచి వెళ్లిపోయేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాంగోపాల్ యాదవ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని విమర్శించిన ములాయం అతడు చెప్పినట్టు అఖిలేశ్ ఆడుతున్నాడని ఆరోపించారు. అఖిలేశ్ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీ డీజీపీగా ముస్లింను నియమిస్తానని చెబితే అఖిలేశ్ తనతో 15 రోజులు మాట్లాడలేదన్నారు. తాను షాజహాన్‌ను అయితే.. అఖిలేశ్ ఔరంగజేబని పార్టీ కార్యకర్తల వద్ద ములాయం అభివర్ణిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.