: వీడిన ఉత్కంఠ.. సైకిల్ గుర్తు అఖిలేష్ యాదవ్ కే.. ములాయం వర్గానికి భంగపాటు!
ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో వచ్చిన కుటుంబ కలహాలతో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే, సమాజ్‌వాదీ పార్టీ గుర్తు ఈ ఇద్దరిలో ఎవరికి చెందుతుందని రాజకీయ వర్గాల్లో ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. తమ పార్టీలో తన వర్గానికే అధిక బలం ఉందని నిరూపించుకున్న అఖిలేష్ వర్గానికే సైకిల్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ములాయం సింగ్ వర్గానికి భంగపాటు కలిగింది. అయితే, ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము ఆమోదిస్తామని ములాయం సింగ్ ఇప్పటికే ప్రకటించారు.