: రెండేళ్ల భారత సంతతి బాలుడికి వాతలు పెట్టిన ఆయా... అది క్రమశిక్షణలో భాగమన్న నల్లజాతి యువతి!


ఉద్యోగాలకు వెళుతూ, తమ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుందని నమ్మి ఓ ఆయా చేతిలో పెడితే, రెండేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా వాతలు పెట్టిందో నల్లజాతి యువతి. ఈ విషయం సెక్యూరిటీ కెమెరాలకు చిక్కగా, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయాను అరెస్ట్ చేశారు. తన బిడ్డ ఆలనా పాలనా చూసేందుకు నాషిపో నుమాలో (21) అనే యువతిని ఓ భారత సంతతి జంట నియమించుకుంది.

ఈ క్రమంలో తాజాగా తన బిడ్డ అలెగ్జాండర్ చేతులు, కాళ్లపై కాలిన వాతలను గమనించిన బాలుడి తల్లి ఏంజెలా సీసీ టీవీ ఫుటేజ్ గమనించగా, నుమాలో స్వయంగా ఐరన్ రాడ్డును కాల్చి వాతలు పెడుతున్నట్టు తెలిసింది. ఏంజెలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నుమాలోను అరెస్ట్ చేసి విచారించగా, ఆమె నిస్సిగ్గుగా తాను చేసిన తప్పును అంగీకరించడం గమనార్హం. "ఆ పిల్లాడు నా మాట వినడం లేదు. అతన్ని క్రమశిక్షణలో పెట్టాలని భావించి, ఇనుప రాడ్డుతో వాతలు పెట్టాను" అని ఆమె స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులే అవాక్కయ్యారు. నిందితురాలిని కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News