: వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకి బీజేపీ సై


రాబోయే 2014 ఎన్నికల్లో అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పొత్తులతో విసిగి పోయామని, భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు తప్పన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. తమతో పొత్తు పెట్టుకోమని తాము ఎప్పుడూ బాబును అడగలేదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఈరోజు ఆయన వెళుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి మంత్రులతో పాలన నడుస్తుంటే, కిరణ్ కర్ణాటకలో నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News