: ఇండియాలో సోకిన 'సూపర్ బగ్'... 13 యాంటీ బయాటిక్స్ విఫలం, అమెరికాలో మరణించిన మహిళ!


అమెరికాకు చెందిన ఓ మహిళ, భారత పర్యటనకు వచ్చిన వేళ అంతుచిక్కని ఇన్ఫెక్షన్ సోకగా, ఎన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడినా, అవన్నీ విఫలం కావడంతో ఆమె మరణించింది. దాదాపు రెండు సంవత్సరాలు ఇండియాలో ఉండి తిరిగి అమెరికాకు వెళ్లిన ఆమె, ఆరోగ్యం బాగాలేదని ఓ ఆసుపత్రిలో చేరడంతో తొలుత ఆమెకు సాధారణ వైద్య పరీక్షలే చేశారు. ఆమెకు సోకిన వ్యాధిని   తొలగించలేక, ఆపై మరింతలోతైన పరీక్షలు చేసి సీఆర్ఈ (కార్బపెనిమ్ - రెసిస్టెంట్ ఎంటిరోబాక్టీరియాసే - వ్యక్తిని మరణానికి దగ్గర చేసేలా, ఒక్కో అవయవాన్నీ పని చేయకుండా చేస్తుంది) సోకిందని గుర్తించారు.

ఆపై అందుబాటులోని యాంటీ బయాటిక్స్ వాడినా ఫలితం లేకపోయింది. సీఆర్ఈ తరువాత ఆమెకు క్లెబ్ సిల్లా న్యుమోనియా సైతం సోకిందని డాక్టర్లు గుర్తించారు. ఆమెకు చికిత్స చేసేందుకు 13 రకాల పవర్ ఫుల్ యాంటీ బయోటిక్స్ ఇచ్చినా అవేమీ పని చేయలేదు. ఆసుపత్రిలో రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి, ఆమె మరణించగా, ఇప్పుడామెకు సోకిన భారత 'సూపర్ బగ్'పై వైద్యులు పెద్దఎత్తున పరిశోధనలు సాగిస్తున్నారు. ఆమె ఇండియాలో రెండేళ్లు ఉండగా, నాలుగు సార్లు ఆసుపత్రిలో చికిత్స పొందారని, ఇండియాలో ఆమె కాలి ఎముక విరగగా, చికిత్స చేయించుకుందని యూఎస్ వైద్యులు తెలిపారు. ఆమెకు ఈ అంతు చిక్కని బాక్టీరియా ఇండియాలోనే సోకిందని వాషోయ్ కౌంటీ హెల్త్ డిస్ట్రిక్ట్ సీనియర్ ఎమిడమాలజిస్ట్ డాక్టర్ లీ చెన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News