: అటపాక నుంచి కైకలూరు, భీమవరానికి విస్తరించిన 'చిరు ప్లెక్సీ'ల రగడ!
మెగాస్టార్ చిరంజీవి ప్లెక్సీల చించివేత తరువాత కృష్ణా జిల్లాలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు పశ్చిమ గోదావరి జిల్లాకు పాకాయి. ఈ తెల్లవారుజామున కైకలూరు సమీపంలోని అటపాక వద్ద చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'పై కట్టిన ప్లెక్సీలను ఎవరో దగ్ధం చేశారు. దీనిపై ఆగ్రహించిన అభిమాన సంఘాలు రోడ్లపై నిరసనలకు దిగగా, వారికి మద్దతుగా కైకలూరు, భీమవరం, ఉండి, నరసాపురం తదితర ప్రాంతాల్లోనూ అభిమానులు ర్యాలీ, ధర్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతోనే కొందరు తమ అభిమాన హీరో ప్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చిరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.