: 19న మార్కెట్లోకి... రెడ్ మీ నోట్ 3 ధరకే నోట్ 4!
భారత మార్కెట్లో నోట్ 3 పేరిట స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసి విజయవంతమైన షియోమీ, దాదాపు అదే ధరకు, మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లను జోడించిన నోట్4 ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ ను 19వ తేదీ గురువారం నాడు విడుదల చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ ఫీచర్స్ లో 2.5 డ్రాగన్ గ్లాస్ తో 5.5 అంగుళాల డిస్ ప్లే, వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 32 / 64 జీబీ అంతర్గత మెమోరీ, 4జీ ఎల్టీఈ, హైబ్రిడ్ సిమ్ ట్రే, 13/5 ఎంపీ కెమెరాలు, 4100 లీ-పాలిమర్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. 32 జీబీ సామర్థ్యంతో వచ్చే ఫోన్ ధర రూ. 12 వేలు, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమోరీతో వచ్చే ఫోన్ ధర రూ. 15 వేల వరకూ ఉండవచ్చని సమాచారం.