: అత్యధికులు వాడుతున్న టాప్ పాస్ వర్డ్ లు ఇవే!
ఈ-మెయిల్ ఖాతాల నుంచి బ్యాంకు ఎకౌంట్ల వరకూ... 2016లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు వినియోగించిన పాస్ వర్డ్ ఏంటో తెలుసా?... 123456... ఒకటి నుంచి ఆరంకెల వరకూ ఉన్న పాస్ వర్డ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆపై '123456789', 'qwerty' (క్వెర్టీ) ఉన్నాయి. దాదాపు కోటికి పైగా సెక్యూరిటీ కోడ్స్ ను పరిశీలించిన సైంటిస్టులు టాప్ పాస్ వర్డ్ లను వెల్లడించారు. ఇక అత్యధికులు వాడిన పాస్ వర్డ్ లలో '123123', '111111', '987654321' కూడా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ముప్పు ప్రమాదకరంగా పరిణమించిన వేళ, ఈ తరహా సులభ పాస్ వర్డ్స్ తో హ్యాకింగ్ ముప్పు అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.