: దేవినేని ఉమాకు అంత క్రిమినల్ మైండ్ లేదు: కేశినేని నాని


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తన మనసులోని విషయాలను ఓ వార్తా చానల్ తో పంచుకున్నారు. దేవినేని ఉమతో తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. దేవినేని ఉమాను రాజకీయంగా అణగదొగ్గేందుకే కాల్ మనీ కేసును తెరమీదకు తీసుకొచ్చారన్న ప్రశ్నకు నాని స్పందించారు. దేవినేని ఉమ దొంగల్ని, దొంగ నాయకులను ప్రోత్సహించరని, అతను వ్యక్తిత్వం గురించి తనకు తెలుసునన్నారు. కాకపోతే ఉమ రాజకీయంగా ఎత్తుగడలు వేస్తాడని, అంతేగానీ అతనికి అంత క్రిమినల్ మైండ్, ఆలోచనలు లేవని కేశినేని నాని తేల్చేశారు.

వడ్డీకి అప్పులు ఇచ్చి బాధిత మహిళలను లైంగికంగా వేధించుకుతిన్న కాల్ మనీ కేసు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ కేసులో దేవినేని ఉమ ప్రధాన అనుచరుడిపై కేశినేని నాని స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంపైనా ఆయన స్పందించారు.

‘‘ఓ రోజు ఓ మహిళ (కాల్ మనీ బాధితురాలు) నా కార్యాలయానికి వచ్చింది. ఆ సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. తనకు జరిగిన అన్యాయం గురించి కార్యాలయంలో ఉన్న వారికి చెప్పింది. నేను టీడీపీ నగర సెక్రటరీ అన్నా పటేల్ కు ఫోన్ చేసి విషయం కనుక్కోమని చెప్పాను. ఆయన కనుక్కున్న తర్వాత 'నిజమే అన్నా ఆమె చెప్పింది వాస్తవాలే'ననడంతో పోలీసు కమిషనర్ కు ఫోన్ చేసి బాధిత మహిళ, టీడీపీ సెక్రటరీ వస్తున్నారు. ఆ కేసు చూడాలని చెప్పాను’’ అని కేశినేని నాని వివరించారు. సదరు మహిళ చెప్పిన వ్యక్తి దేవినేని ఉమ అనుచరుడే అయినా... ఉమ నేరగాళ్లను ప్రోత్సహించడని నాని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News