: అమెరికాలో ట్రంప్ కు ఓపక్క నిరసనలు... మరోపక్క స్వాగతాలు!


అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ శకం ప్రారంభం అవుతోంది. 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పాలన ఈ వారమే ప్రారంభం కానుంది. వచ్చే శుక్రవారం ( ఈనెల 20న) ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. తాము ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే 20 మంది డెమొక్రటిక్ నేతలు ప్రకటించారు. ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచీ మహిళలు, మైనారిటీలు తరచుగా తమ నిరసనలను తెలుపుతూనే ఉన్నారు. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. తాజాగా వాషింగ్టన్ లో కొంత మంది యువకులు బైక్స్ కు ట్రంప్ కు విషెస్ తెలుపుతూ బ్యానర్లు కట్టి మరీ ర్యాలీ తీశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News