: భారత్ సత్తా చాటింది.. పూణే వన్డేలో ఇండియా ఘన విజయం!
ఈ రోజు పూణేలో భారత్, ఇంగ్లాండ్ ల మధ్య హోరాహోరీగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఇండియా మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించి, తన సత్తాను మరోసారి ప్రదర్శించింది. చివరివరకు తీవ్ర ఉత్కంఠతో జరిగిన మ్యాచ్ ను భారత్ గెలుచుకోవడంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (122), జాదవ్ (120) కీలక పాత్రలు పోషించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (40) దూకుడుగా ఆడగా, అశ్విన్ (15)కూడా మరింత దూకుడుగా ఆడి 48.1 ఓవర్లలో భారత్ ను విజయతీరాలకు చేర్చారు.