: 20 గంటలు ఏకధాటిగా మొరిగి... యజమాని ప్రాణాలను నిలబెట్టిన శునకం!
అమెరికాలోని మిచిగాన్ పీటాస్‌కేయ్‌లో ఓ శునకం తన యజమాని ప్రాణాలను కాపాడింది. మంచులో కూరుకుపోయి నరకయాతన అనుభవిస్తోన్న బాబ్ (64) ని కాపాడేందుకు ఆ మూగజీవి దాదాపు 20 గంటల పాటు ఏకధాటిగా మొరిగింది. చివరకు ఆ కుక్క అరుపులు విని ఒక వ్యక్తి అక్కడకు చేరుకొని మంచుని తొలగించాడు. తర్వాత బాబ్ కూతురికి ఆ వ్యక్తి ఈ సమాచారం అందించి, తరువాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. జాబ్ వెన్నెముకకు శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్లు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. ఆ శునకమే బాబ్‌ను కాపాడిందని అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాబ్ నూతన సంవత్సర వేడుకల కోసం కట్టెలు తెచ్చుకునేందుకు బయల్దేరిన సమయంలో ఆయన కాలు జారిపోయి, మంచులో కూరుకుపోయాడు. అతడి మెడ భాగం వరకు మంచు కప్పుకుపోవడంతో దానిలో నుంచి బయటకు రాలేకపోయాడు. దీంతో అక్కడే 20 గంటల పాటు తన యజమానిని కాపాడుకోవడానికి మొరిగిన కుక్క ఎట్టకేలకు అతడి ప్రాణాలు నిలిపింది.