: సాహో గౌతమిపుత్ర శాతకర్ణి.. సాహో!: బాలయ్య సినిమాపై స్పందించిన జూ.ఎన్టీఆర్
సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఎందరో టాలీవుడ్ అగ్రనటులు, రాజకీయ ప్రముఖులు స్పందించి, బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చూశాడట.
ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఇప్పుడే ఆ సినిమాని చూశానని చెబుతూ, 'సాహో నందమూరి బాలకృష్ణ... సాహో డైరెక్టర్ క్రిష్... సాహో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్' అని పేర్కొన్నాడు. 'ఇది ఒక తెలుగువాడి విజయం. ఇది తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం. చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం' అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్టీఆర్ త్వరలో బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Just finished watching #GPSK all I can say Saho #NBK Saho @DirKrish and Saho to the whole team of #GPSK pic.twitter.com/gFsp8tMj86
— tarakaram n (@tarak9999) January 15, 2017