: అద‌ర‌గొట్టిన జాధ‌వ్‌.. 29 బంతుల్లో అర్ధ‌శ‌త‌కం


ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న‌ తొలి వన్డేలో 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ రాహుల్ , శిఖ‌ర్ ధావ‌న్, యువీ, ధోనీ విఫ‌ల‌మై టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టిన వేళ జాధ‌వ్ మాత్రం అద‌ర‌గొట్టాడు. ధోనీ అవుట‌యిన అనంత‌రం ఆరో బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వ‌చ్చి జాధ‌వ్ 29 బంతుల‌కే అర్ధ సెంచ‌రీ చేశాడు. మ‌రోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అర్ధ సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు. ప్ర‌స్తుతం కోహ్లీ 74, జాధ‌వ్ 61 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా చేతిలో మ‌రో ఆరు వికెట్లు ఉన్నాయి. ల‌క్ష్య‌సాధ‌న‌లో మ‌రో 24 ఓవ‌ర్ల‌లో 177 ప‌రుగులు చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు 174/4 గా ఉంది.


  • Loading...

More Telugu News