: గంగాసాగర్ జాతరలో తొక్కిసలాట.. ఐదుగురి మృతి.. 13 మందికి తీవ్రగాయాలు
పశ్చిమ బెంగాల్‌లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న ప్రసిద్ధ గంగాసాగర్ జాతరలో ఈ రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక సిబ్బంది క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.