: ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సోదరుడి పెట్రోల్‌బంక్‌పై అవినీతి నిరోధక విజిలెన్స్‌ విభాగం దాడి


బ్లాక్‌ మార్కెటింగ్‌, కల్తీ వంటి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సోదరుడి పెట్రోల్‌బంకుతో పాటు ప‌లు పెట్రోల్ బంకుల‌పై అవినీతి నిరోధక విజిలెన్స్‌ విభాగం అధికారులు దాడి చేశారు. ఈ అంశంపై స్పందించేందుకు కేంద్ర మంత్రి అందుబాటులో లేరు. భువ‌నేశ్వ‌ర్‌, అన్గోల్‌ జిల్లా తాల్చేర్‌లోని ప‌లు బంకులు, గ్యాస్ ఏజెన్నీల‌పై దాడులు జ‌రిపామ‌ని, అందులో భాగంగానే మంత్రి సోద‌రుడి పెట్రోల్ బంక్‌పై కూడా దాడి జ‌రిపామ‌ని అధికారులు తెలిపారు. ఈ అంశంపై ప్ర‌తిప‌క్ష నేత‌లు మండిప‌డుతూ విజిలెన్స్‌ శాఖను దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపించారు.

  • Loading...

More Telugu News