: కోహ్లీకి పరీక్షే... టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్
పుణె వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 350 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో రాయ్ 73, హేల్స్ 9(రనౌట్), రూట్ 78, మోర్గాన్ 28, బట్లర్ 31, స్టోక్స్ 62, అలీ 28, పరుగులు చేయగా వోక్స్ 9, విల్లే 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రాలకి తలో రెండు వికెట్లు దక్కగా, ఉమేష్, జడేజాలకు ఒక్కో వికెట్టు దక్కాయి. వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత విరాట్ కోహ్లీ ఆడుతున్న తొలిమ్యాచ్ ఇదేనన్న విషయం తెలిసిందే.