: బస్సులోంచి దించేశాడు.. అవమానించేలా మాట్లాడాడు.. బాధతో ఏడ్చా: అమెరికాలో ఓ ముస్లిం బాలిక
అమెరికాలో బురఖా ధరించిన మహిళలను బస్సులలో నుంచి మాత్రమే కాకుండా విమానాల్లోంచి కూడా దించివేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అటువంటి వివక్షే ఓ బాలికపై చూపించారు. బురఖా ధరించి వచ్చినందుకు గానూ ఓ స్కూల్ బస్ డ్రైవర్ ఆ విద్యార్థినిని బస్సులోంచి దించివేశాడు. ఆ దేశంలోని ఉటావ రాష్ట్రం ప్రొవో నగరంలో జన్నా బకీర్ అనే 15 ఏళ్ల బాలికకు ఈ అనుభవం ఎదురైంది. ఆ బాలికకు ఇలాంటి ఘటన ఎదురవడం ఇది రెండోసారి.
తాను టింప్వ్యూ హైస్కూల్ విద్యార్థినినని, స్కూల్ డ్రెస్‌తో పాటు బురఖా వేసుకుని వెళ్లినందుకు తమ స్కూల్ బస్ డ్రైవర్ తనను దించివేసి, తనను అవమానించేలా మాట్లాడాడని, బాధతో ఏడ్చానని బాధిత బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతురిపై ఇలా ప్రవర్తించినందుకు ఆ పాఠశాల యాజమాన్యం తమకు క్షమాపణలు చెప్పాలని ఆ బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ న్యాయవాదిని ఆశ్రయించారు.