: మోదీ చిత్రపటాన్ని ముద్రించడం అంటే గాంధీని అవమానించడమే!: వీహెచ్


ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విడుదల చేసిన 2017 క్యాలెండర్, డైరీలపై ప్ర‌ధానమంత్రి మోదీ చిత్రాన్ని ముద్రించడం ప‌ట్ల ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు భ‌గ్గుమంటున్నారు. రాట్నం తిప్పుతున్న గాంధీ చిత్రానికి బ‌దులుగా వాటిల్లో మోదీ చిత్రాలను ప్ర‌చురించ‌డంతో ఖాదీ విలేజ్‌ ఇండ‌స్ట్రీస్‌ ఉద్యోగులు కూడా నిరసనలకు తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఇదే విష‌యంపై నిర‌స‌న‌గా మౌనదీక్ష చేపట్టారు. గాంధీజీ స్థానంలో మోదీ చిత్రపటాన్ని ముద్రించడం గాంధీని అవమానించడమేనని వి.హ‌నుమంత‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ దీక్ష‌లో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News