: బాహుబలి-2 సినిమాలో ‘దేవసేన’ అనుష్కకి మంత్రిగా నటిస్తున్నా: హాస్య‌న‌టుడు పృథ్వీ


ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న‌ బాహుబలి-2 సినిమాలో తాను కూడా న‌టిస్తున్నాన‌ని, దేవసేన పాత్ర వేసిన అనుష్కకు మంత్రిగా క‌నిపిస్తాన‌ని హాస్య‌న‌టుడు పృథ్వీ తెలిపాడు. ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... బాహుబలి పార్ట్ 1 క‌న్నా పార్ట్ 2 పై ప్రేక్ష‌కుల్లో ఎన్నో అంచ‌నాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పాడు. దేవసేన సామ్రాజ్యంలో తాను కూడా ఉంటాన‌ని చెప్పాడు. ఆ సినిమాలో మాత్రం తాను కామెడీ క్యారెక్ట‌ర్ చేయ‌డం లేద‌ని అన్నాడు. బాహుబ‌లి షూటింగ్‌కు వెళితే ఇంటికి వెళ్లిన‌ట్లే ఉంటుంద‌ని చెప్పాడు.  

  • Loading...

More Telugu News