: త్వరలోనే హీరోగా మీ ముందుకు వస్తున్నా: హాస్యనటుడు పృథ్వీ
గత ఏడాది తనకు మరచిపోలేని సంవత్సరమని, 2016లో తాను ఊహించని సినిమాల్లో నటించానని హాస్యనటుడు పృథ్వీ అన్నాడు. గతేడాది తాను చిరంజీవితో కలిసి పనిచేశానని, దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలోనూ నటించానని అన్నాడు. తాను ఈ ఏడాది ఫుల్ లెంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని అన్నారు. ఏప్రిల్, మేలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపాడు. సినిమాల్లో హీరోలను అనుకరిస్తూ తాను డైలాగులు చెబుతోంటే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, తాను ఆ డైలాగ్స్ మాత్రం సీరియస్‌గానే చెబుతానని, థియేటర్‌లో ప్రేక్షకులు మాత్రం గొల్లున నవ్వుతున్నారని అన్నాడు. అలా నవ్వించడం తనకు దేవుడు ఇచ్చిన వరమని అన్నాడు.