: వైసీపీలో కొత్త చేరికలు... జగన్ ను కలిసిన కోటగిరి శ్రీధర్
మాజీ మంత్రి, దివంగత కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైకాపాలో చేరిక దాదాపు ఖరారైంది. ఈ ఉదయం హైదరాబాదు, లోటస్ పాండ్ లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటికి వచ్చిన శ్రీధర్, ఆయనతో భేటీ అయ్యారు. ఈ నెల 28న శ్రీధర్ అధికారంగా వైసీపీలో చేరనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ద్వారకా తిరుమలలో అదే రోజు వైకాపా నిర్వహించనున్న బహిరంగ సభలో శ్రీధర్ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. కాగా, శ్రీధర్‌తో పాటు పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని తదితరులు జగన్ తో సమావేశం అయ్యారు.