: పంజాబ్ లో కాంగ్రెస్ కు ఊహించని షాక్!


మరో నెలలో పంజాబ్ లో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.  పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌ కుమార్తె, అమరీందర్ క్యాబినెట్ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకమైన గుర్ కన్వాల్ కౌర్ అకస్మాత్తుగా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దేశ రాజధానిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అవినాశ్‌ రాయ్‌ ఖన్నా తదితరుల సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంజాబ్ ప్రజల కోసం తన తండ్రి రక్తం ధారపోశారని, అయినా కాంగ్రెస్ పార్టీ కనీస సానుభూతి చూపలేదని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వైఖరి నచ్చకనే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపాడు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి, ఆయన విధానాలు నచ్చి బీజేపీలో చేరినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News